- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరూ అడిగే ప్రశ్న అదే: విరాట్ కోహ్లీ
అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టును భారత్ డ్రా చేసుకోవడంలో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు సెషన్లపాటు క్రీజులో ఉన్న కోహ్లీ.. టెస్టుల్లో మూడేళ్ల శతక నిరీక్షణ తెరదించాడు. మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి బీసీసీఐ టీవీతో మాట్లాడిన కోహ్లీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. లిఫ్ట్ వద్ద ఉన్న వ్యక్తి నుంచి బస్ డ్రైవర్ వరకు, హోటల్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అందరూ సెంచరీ గురించే అడిగేవారని తెలిపాడు.
‘జట్టు కోసం వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం, భారీ పరుగులు సాధించడమే నా లక్ష్యం. ఆ మార్గంలో సెంచరీ ఉంటుంది. మైలురాయిపై నేను ఎప్పుడూ దృష్టి పెట్టను. కానీ, సెంచరీకే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇది చాలా క్లిష్టంగా మారుతోంది’ అని కోహ్లీ చెప్పాడు. ఎప్పుడూ ఒకే మైండ్‌సెట్‌తో ఆడటం మంచిది కాదని, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలన్నాడు. మూడు ఫార్మాట్లలో తాను రాణించడానికి అదే కారణమని చెప్పాడు. ‘శారీరకంగా, మానసికంగా పరిస్థితులను అందిపుచ్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకు నేను మానసికంగా సిద్ధమయ్యా. అహ్మదాబాద్ వికెట్‌పై నేను 6 డబుల్స్ కూడా తీయగలను. అందుకే నేను విభిన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయగలను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, నాలుగో టెస్టులో 364 బంతుల్లో 186 పరుగులు చేసిన కోహ్లీ.. కెరీర్‌లో అత్యంత స్లో ఇన్నింగ్స్ ఆడాడు.