- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Canada Open: సింధు నిష్ర్కమణ.. ఫైనల్‌కు లక్ష్యసేన్
కాల్గరీ : కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న అతను సెమీస్‌లో 4వ సీడ్ కెంటా నిషిమోటోను చిత్తు చేశాడు. ఆదివారం జరిగిన సెమీస్‌లో లక్ష్యసేన్ 21-17, 21-14 తేడాతో జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటోపై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో మొదట నిషిమోటో దూకుడుగా ఆడి 4-0తో లీడ్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత కాస్త పుంజుకున్న లక్ష్యసేన్ ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించుకుంటూ వెళ్లి 11-11తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకుని 16-11తో ఆధిక్యంలోకి వెళ్లిన లక్ష్యసేన్ అదే జోరులో తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లోనూ అతను అదే దూకుడు ప్రదర్శించాడు.
ప్రారంభంలో నిషిమోటో నుంచి పోటీ ఎదురైనప్పటికీ లక్ష్యసేన్ ఏ మాత్రం లెక్కచేయకుండా దూకుడుగా ఆడి వరుసగా రెండో గేమ్‌ను దక్కించుకుని విజేతగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్.. 5వ సీడ్, చైనా ప్లేయర్ లి షి పెంగ్‌తో తలపడనున్నాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు నిష్ర్కమించింది. సెమీస్‌లో సింధు 14-21, 15-21 తేడాతో టాప్ సీడ్, ఆక్నె యమగూచి చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో 13-9తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె.. ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించలేక ప్రత్యర్థికి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను అప్పగించింది. ఈ సీజన్లో యమగూచి చేతిలో సింధుకు ఇది రెండో ఓటమి. దాంతో ఈ ఏడాది మరో టోర్నీలోనూ సింధు టైటిల్ గెలవకుండానే ఇంటిదారి పట్టింది.