All England Open : సెమీస్‌లో ముగిసిన లక్ష్యసేన్ పోరాటం

by Harish |
All England Open : సెమీస్‌లో ముగిసిన లక్ష్యసేన్ పోరాటం
X

దిశ, స్పోర్ట్స్ : ఆల్ ఇండియా ఓపెన్ చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. టోర్నీలో సత్తాచాటిన అతను సెమీస్‌ను దాటలేకపోయాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ 12-21, 21-10, 15-21 తేడాతో ఇండోనేషియా ప్లేయర్ జోనాటన్ క్రిస్టీ చేతిలో పోరాడి ఓడాడు. గంటా 8 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన అతను రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశాలు ఇవ్వని లక్ష్యసేన్ ఏకపక్షంగా ఆ గేమ్‌ను దక్కించుకుని పోటీలోకి వచ్చాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ మొదట్లో లక్ష్యసేన్ ఆధిపత్యమే కొనసాగింది. 6-3తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత ఇండోనేషియా ప్లేయర్ పుంజుకోవడంతో ఒత్తిడిలో పలు తప్పిదాలు చేసిన లక్ష్యసేన్ వెనుకబడి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కోల్పోయాడు. దీంతో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ గెలవాలన్న అతని ఆశలు సెమీస్‌లో ఆవిరయ్యాయి. 2022లో లక్ష్యసేన్ ఫైనల్‌‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. లక్ష్యసేన్ నిష్ర్కమణతో ఈ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed