WI Vs IND 1st ODI: కుల్దీప్‌ యాదవ్‌ సంచలన స్పెల్‌.. విండీస్ స్వల్ప స్కోరుకే ఆలౌట్‌

by Vinod kumar |
WI Vs IND 1st ODI: కుల్దీప్‌ యాదవ్‌ సంచలన స్పెల్‌.. విండీస్ స్వల్ప స్కోరుకే ఆలౌట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: బార్బడోస్‌ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బ్యాటర్లలో షెయ్‌ హోప్‌ ఒక్కడే 43 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాటర్స్ బ్రాండన్ (17), కైల్ మేయర్స్ (2), అలిక్ అథంజే (22), హెట్ మెయిర్ (11), పావెల్ (4), షెఫర్డ్ (0) డొమినిక్ డ్రాక్స్ (3), యాన్నిక్ కరిష్ (3) ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో.. కుల్దీప్‌ యాదవ్‌ సంచలన స్పెల్‌తో మెరిశాడు. మూడు ఓవర్లలో రెండు మెయిడెన్లు సహా కేవలం ఆరు పరుగలిచ్చి 4 వికెట్లు తీశాడు. జడేజా 3 వికెట్లు తీయగా.. హార్దిక్‌, శార్దూల్‌, ముకేశ్‌ కుమార్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

Advertisement

Next Story