హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య.. రూ.5 లక్షలు డిమాండ్

by Shiva |
హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య.. రూ.5 లక్షలు డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ క్రికెట్ లో అనతికాలంలోనే సంచలనాలు సృష్టించిన టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా గత ఫిబ్రవరిలో తన భార్య నటాషా స్టాన్కోవిచ్ ను హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహమాడాడు. అయితే, ఈ సందర్భంగా పెళ్లి తంతు జరుగుతుండగా హార్ధిక్ అన్న కృనాల్ పాండ్యా భార్య పాంకురి శర్మ తన మరిది షూస్ కొట్టేసింది. రూ.5 లక్షలు ఇస్తేనే వాటిని తిరిగిస్తానని డిమాండ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. పెళ్లి వేడుకలో భాగంగా గుజరాత్ సంప్రదాయం ప్రకారం ‘జూతా చురాయి’ ని నిర్వహిస్తారు. అందుకు అర్థం ఏంటంటే పెళ్లికొడుకు వేసుకునే పాదరక్షలను దాచిపెట్టడం అన్నమాట. ఇది పెళ్లి కొడుకు వదిన, మరదళ్లు చేయాలి. మన తెలుగు సంప్రదాయంలో పెళ్లికూతురు సోదరులు.. తమకు కాబోయే బావను ఆట పట్టించినట్టు జూతా చురాయి అనేది కూడా ఓ ఆచారమే.

అయితే, కృనాల్ భార్య పాంకురి.. హార్ధిక్ షూస్ దాచిపెట్టి తనకు అడిగినంత కట్నం ఇస్తేనే అవి ఎక్కడున్నాయో చెప్తానంటూ సమాధానం ఇచ్చింది. అప్పుడు హార్ధిక్.. ‘సరే, నీకు ఎంత కావాలో చెప్పు వదిన’ అనడంతో పాంకురి.. రూ.లక్ష కావాలంటూ డిమాండ్ చేసింది. వెంటనే స్పందించిన హార్ధిక్.. రూ.లక్ష ఏం సరిపోతాయి. ఐదు లక్షలు తీసుకో వదినా.. అంటూ తన పక్కనున్న వాళ్లతో డబ్బు సంగతి చూడాలని చెప్పాడు. అయితే, పాంకురి మాత్రం.. తనకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు చూపిస్తేనే షూస్ ఇస్తానని మరిదిని ఆటపట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Next Story