- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో ఆందోళన చెందుతోన్న ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అతను మైదానంలోకి ఉడుగు పెడితే పరుగుల వరదే. ఇకపోతే విరాట్ తాజాగా రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2.Oగా రెచ్చిపోతున్న తరుణంలో.. మరో ఐదారేళ్ల పాటు కోహ్లీ క్రికెట్ ఆడుతాడని భారత క్రికెట్ అభిమానులు ధీమాగా ఉన్న సమయంలో రిటైర్మెంట్ గురించి కీలక ప్రకటన చేసి.. ఫ్యాన్స్ కు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘క్రీడాకారుడిగా నా కెరీర్ క్లోజ్ అయ్యాక మళ్లీ కనిపించనని అన్నారు. నేను ఎప్పటికీ ఆడుతూ ఉండలేనన్నారు. నా కెరీర్ ముగింపు తేదీ ఒకటి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు ఆడిన క్రికెట్‌లో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ నేను ఆటలో కొనసాగినంత కాలం ఆటకోసం నా సర్వస్వం ఇస్తానని పేర్కొన్నారు. కానీ ఒక్కసారి నేను రిటర్మెంట్ ప్రకటిస్తే మాత్రం మీకు కనిపించను’’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు. కోహ్లీ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఒంటి చేత్తో గెలిపిస్తున్నాడు. తొలి 8 మ్యాచ్‌ల్లో 7 ఓటములు చవిచూసిన తర్వాత కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా ఉందంటే.. అందుకు కారణం విరాట్ కోహ్లీనే అని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ తర్వాత కోహ్లీ టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాకు కొండంత అండకానున్నాడు.