- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బాబర్ కంటే కోహ్లియే బెస్ట్’ : పాక్ మాజీ బౌలర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ కోహ్లిని తన పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాక తన దేశానికి చెందిన బాబర్ అజామ్ కంటే కింగ్ కోహ్లి అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఈ పాక్ మాజీ ప్లేయర్ విరాట్ ప్రపంచ స్థాయి ఫిట్ నెస్ ని కలిగి ఉన్నాడని తెలిపారు. ఆ విషయంలో బాబర్ అజామ్ తేలిపోయాడని తెలిపాడు. ‘విరాట్ కోహ్లి అత్యుత్తమ ఆటగాడు.
కెప్టెన్ గా కూడా జట్టును అద్భుతంగా నడిపించాడు. ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటూ.. టీమ్ నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటాడు. విరాట్ లో మరో అత్యుత్తమ విషయం తన ప్రపంచ స్థాయి ఫిట్ నెస్ అని ఈ మాజీ ఆటగాడు ప్రశంసించాడు. ఇక విరాట్ తో పోలిస్తే బాబర్ అజామ్ ఫిట్ నెస్ చాలా పూర్ గా ఉంటుంది. అంతర్జాతీయంగా వన్డేల్లోనూ బాబర్ అజామ్ టాప్ ప్లేయర్. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడతాడని తెలిపాడు. ఫిట్ నెస్ విషయంలో వీరి మధ్య కాస్త తేడా ఉంటుంది. ఆ విషయంలో కోహ్లిదే పై చేయి. అందుకే బాబర్ కంటే విరాట్ బెస్ట్ అని అబ్దుల్ రజాక్ తెలిపాడు.