Asia Cup 2023: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రీలంక బయలు దేరుతున్న స్టార్ ప్లేయర్!

by Vinod kumar |
Asia Cup 2023: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రీలంక బయలు దేరుతున్న స్టార్ ప్లేయర్!
X

దిశ, వెబ్‌డెస్క్: గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నాడని సమాచారం. ఆసియా కప్ కోసం టీమిండియా శ్రీలంక బయలుదేరిన సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. రాహుల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని.. టోర్నీలో గ్రూప్ దశ మ్యాచులకు దూరం అవుతాడని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్సీయేలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టును రాహుల్ క్లియర్ చేశాడని తెలుస్తొంది. దీంతో అతన్ని కూడా శ్రీలంక పంపేందుకు బీసీసీఐ ఏర్పాట్టు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న అతను సూపర్-4 దశ మ్యాచుల నుంచి జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతను ఆటకు దూరంగానే ఉన్నాడు.

అయితే ఆసియా కప్‌కు ముందు అతను కోలుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆసియా కప్ కోసం జట్టును ఎంపిక చేస్తున్న సమయంలో.. మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండగా రాహుల్‌కు మరో చిన్న గాయమైంది. దీంతో అతను ఈ టోర్నీ ప్రారంభ మ్యాచులకు దూరమవ్వాల్సి వచ్చింది. ఈ కారణంగా అతను జట్టుతో కలిసి శ్రీలంకకు రాలేదు. వరల్డ్ కప్‌లో అతను కీలకం అని భావించిన బీసీసీఐ.. ముందు జాగ్రత్త చర్యగా రాహుల్‌ను ఎన్సీయేలోనే ఉంచింది.

ఇప్పుడు తన ఫిట్‌నెస్ టెస్టులు క్లియర్ చేసిన రాహుల్.. జట్టుతో కలిసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే శ్రీలంక బయలుదేరి.. సూపర్-4 మ్యాచుల నుంచి రాహుల్ ఆడతాడని సమచారం. కాగా, రాహుల్ గైర్హాజరీలో జట్టులో చోటు సంపాదించిన ఇషాన్ కిషన్.. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. జట్టు కష్టాల్లో ఉండగా సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అయినా సరే రాహుల్ వస్తే కిషన్‌ను పక్కన పెట్టాల్సి వస్తుందని సమాచారం.

Advertisement

Next Story