- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా క్రికెట్ కెరీర్ ఆ రోజే ముగిసిందనుకున్న.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా చివరి వరకు పోరాడి ఓడింది. అయితే, యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ కీలక సమయంలో క్యాచ్ మిస్ చేయడం వల్లే భారత్ ఓడిందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో అర్షదీప్ సింగ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. అర్షదీప్‌పై వస్తున్న విమర్శలపై కోహ్లీ స్పందిస్తూ.. ఒత్తిడిలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని వెనకేసుకొచ్చాడు. తాను కెరీర్‌లో ఎన్నో తప్పులు చేశానని తెలిపాడు. 2009 ఛాంపియన్స్ ట్రోఫిలో తన మొదటి మ్యా్చ్ లోనే పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ ఆఫ్రిది బౌలింగ్‌లో చెత్త షాట్లు ఔట్ అయ్యానని.. దీంతో మ్యాచ్ ముగిసిన రోజు ఉదయం 5 గంటల వరకు సీలింగ్ వైపు చూస్తూ అలానే ఉండిపోయానని గుర్తు చేసుకున్నాడు. ఇక ఆ రోజే తన కెరీర్ ముగిసిందని అనుకున్నానని కోహ్లీ ఈ సందర్భంగా తెలిపాడు. కావాలని ఎవరు తప్పులు చేయరని.. ఒత్తిడిలో తప్పులు జరగడం సహజమని పేర్కొన్నాడు.
Also Read : నా నెంబర్ చాలామంది దగ్గర ఉన్న.. ఆ సమయంలో ధోని ఒక్కడే మెసేజ్ చేశాడు: kohli
- Tags
- Viratkohli