IND vs WI: విండీస్‌తో తొలి వన్డే.. 9 ఏళ్ల తర్వాత తొలి వన్డే మ్యాచ్‌.. టీమిండియా క్రికెటర్‌ రీఎంట్రీ!

by Vinod kumar |
IND vs WI: విండీస్‌తో తొలి వన్డే.. 9 ఏళ్ల తర్వాత తొలి వన్డే మ్యాచ్‌.. టీమిండియా క్రికెటర్‌ రీఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేసర్‌ జయదేవ్‌ ఉనద్కట్‌ 9 ఏళ్ల తర్వాత తొలి వన్డే మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గురువారం బార్బోడస్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉనద్కట్‌కు చోటు దక్కనున్నట్లు సమాచారం. విండీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దూరమయ్యాడు. మడమ నొప్పితో బాధపడుతున్న సిరాజ్‌కు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతి నిచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది.

ఈ క్రమంలో తొలి వన్డేలో సిరాజ్‌ స్ధానాన్ని ఉనద్కట్‌తో భర్తీ చేయాలని భారత జట్టు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉనద్కట్‌ చివరగా 2013లో ఇదే వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు భారత్‌ తరఫున 7 వన్డేలు ఆడిన జయదేవ్‌.. 8 వికెట్లు పడగొట్టాడు. అతడి కెరీర్‌లో 4/41 అత్యత్తుమ బౌలింగ్‌ గణాంకాలగా ఉన్నాయి.

తుది జట్లు(అంచనా)

భారత్‌ జట్టు:

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ , జయదేవ్‌ ఉనద్కట్‌

విండీస్‌ జట్టు:

బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్

Advertisement

Next Story