టీమ్ ఇండియాకు గుడ్‌ న్యూస్.. స్టార్ పేసర్ ఫిట్!

by Vinod kumar |
టీమ్ ఇండియాకు గుడ్‌ న్యూస్.. స్టార్ పేసర్ ఫిట్!
X

న్యూఢిల్లీ : వెన్నెముక గాయంతో జట్టుకు దూరమైన టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టు తెలుస్తోంది. సర్జరీ అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రా పునరావాసం పొందుతున్న విషయం తెలిసిందే. తిరిగి జట్టులోకి వచ్చేందుకు అతను కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రోజుకు 8 నుంచి 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు.

దాంతో ఆసియా కప్‌తోపాటు వన్డే వరల్డ్ కప్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. అంతకుముందే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ సెలెక్షన్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. ఆసియా కప్, వరల్డ్ కప్ ముందు బుమ్రా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ, సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐర్లాండ్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నది. ఈ సిరీస్‌కు ముందే ఎన్‌సీఏలో బుమ్రా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడతాడని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed