రోహిత్‌ను వెనక్కినెట్టిన బుమ్రా.. ఐసీసీ అవార్డు సొంతం

by Harish |
రోహిత్‌ను వెనక్కినెట్టిన బుమ్రా.. ఐసీసీ అవార్డు సొంతం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా జూన్‌ నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలుచుకున్నాడు. రేసులో ఉన్న సహచరుడు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అఫ్గానిస్తాన్ బ్యాటర్ గుర్బాజ్‌లను వెనక్కినెట్టి బుమ్రా అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలవడంలో అతనికి ఇదే తొలిసారి.

టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్‌ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 8.27 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాతో ఫైనల్‌లోనూ తన కోటాలో 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రా రెండు ఓవర్లు కట్టుదిట్టంగా వేసి మ్యాచ్ చేజారకుండా చూశాడు. ఐసీసీ అవార్డు గెలవడంపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ అపూర్వ విజయం తర్వాత దక్కిన ప్రత్యేక గౌరవని తెలిపాడు.

మరోవైపు, ఉమెన్స్ క్రికెట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను ఈ అవార్డు వరించింది. గత నెలలో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఏకైక టెస్టు మ్యాచ్‌ల్లో ఆమె సత్తాచాటింది. మూడు వన్డేల్లో వరుసగా 113, 136, 90 పరుగులు చేసింది. ఏకైక టెస్టులో 149 రన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ క్రీడాకారిణి మైయా బౌచియర్, శ్రీలంకకు చెందిన విష్మి గుణరత్నే‌లను అధిగమించి స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed