కోహ్లీ, రోహిత్ గొడవ పడింది నిజమే: మాజీ కోచ్ శ్రీధర్

by Satheesh |   ( Updated:2023-02-05 04:18:31.0  )
కోహ్లీ, రోహిత్ గొడవ పడింది నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తన ఆటో బయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో కీలక విషయాలు వెల్లడించారు. గతంలో టీమిండియా కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య జరిగిన గొడవ గురించి ఆయన బయటపెట్టారు. వెస్టిండీస్ టూర్ సమయంలో అప్పటి కెప్టెన్ కోహ్లీకి, సీనియర్ బ్యాటర్ రోహిత్‌కి గొడవ జరిగిన విషయం నిజమేనని చెప్పారు. జట్టులో కోహ్లీ, రోహిత్ వర్గాలుగా రెండుగా విడిపోయాయని తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారనే విషయాన్ని బయటపెట్టారు. జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆ సమయంలో టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశ్రాస్తి కోహ్లీ, రోహిత్‌లను పిలిచి మాట్లాడారు.

మీరిద్దరూ టీమిండియాలో సీనియర్ ప్లేయర్లని.. మీరే ఇలా జట్టులో వర్గాలు విడిపోతే ఎలా అని కోహ్లీ, రోహిత్‌కి రవిశాస్త్రి రాజీ కుదిర్చారని పేర్కొన్నారు. విభేదాలన్ని పక్కన పెట్టి భారత జట్టును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కాగా, గతంలో కోహ్లీ, రోహిత్‌కి విభేదాలు ఉన్నాయన్న వార్తలు జోరుగా వినిపించాయి. సోషల్ మీడియాలో సహచర క్రికెటర్లు అయిన రోహిత్, కోహ్లీ ఒకరిని ఒకరు ఫాలో కాకపోవడం, విష్ చేసుకోకపోవడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా, శ్రీధర్ బయోగఫ్రీతో కోహ్లీ, రోహిత్‌ల మధ్య విభేదాలు నిజమే అని విషయం బయటపడింది.

Also Read...

డోపింగ్ కారణంగా దీపా కర్మాకర్ పై 21 నెలల నిషేధం

Advertisement

Next Story