Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కొడుకు పేరు అదేనా..!

by Y. Venkata Narasimha Reddy |
Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కొడుకు పేరు అదేనా..!
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా కెప్టన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ( Rohit Sharma) కొడుకు(Son)పేరుకు సంబంధించి రోహిత్ భార్య రితిక పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. రోహిత్ శర్మకు నవంబర్ 15న కుమారుడు పుట్టాడు. అప్పటి నుంచి రోహిత్ దంపతులు తమ వారసుడికి ఏం పేరు పెడుతారన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా రోహిత్ భార్య రితిక క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంతా క్లాజ్ క్యాప్‌లతో ఉన్న బొమ్మలో కుమారుడు పేరు ఆహాన్ అని సోషల్ మీడియా ద్వారా లీక్ ఇచ్చింది. శాంతా క్లాజ్‌ క్యాప్‌లు పెట్టుకున్న ఉన్న ఫ్యామిలీ ఫొటోను రితిక పోస్ట్ చేసింది.

అందులోని ఫొటోలో నలుగురు కుటుంబ సభ్యులకు తగ్గట్టుగా నాలుగు బొమ్మలు ఉన్నాయి. శాంతా క్లాజ్ ఆకృతిలోని రెండు పెద్ద బొమ్మల క్యాప్ లకు ఒకదానికి రిట్స్, మరో క్యాప్ కు రో, చిన్న బొమ్మల క్యాపులకు ఆహాన్, సమీ అన్న పేర్లు రాసి ఉన్నాయి. టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ దంపతులకు ఇది వరకే సమైరా శర్మ అనే కూతురు ఉండగా, తాజాగా వారికి కొడుకు పుట్టాడు.

Advertisement

Next Story