ఐపీఎల్ మెగా వేలం తేదీ, వేదిక ఖరారు?.. వేదిక ఎక్కడో తెలుసా?

by Harish |
ఐపీఎల్ మెగా వేలం తేదీ, వేదిక ఖరారు?.. వేదిక ఎక్కడో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ప్రక్రియను బీసీసీఐ వేగవంతం చేసింది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వేలం తేదీ, వేదికను కూడా బోర్డు ఖరారు చేసినట్టు తెలిసింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌‌లో వేలం నిర్వహించాలని బోర్డు నిర్ణయించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. మెగా వేలం రెండు రోజులపాటు జరగనుంది. ఈ నెల 24, 25 తేదీల్లో ఆక్షన్ నిర్వహించనున్నట్టు సదరు మీడియా సంస్థ తెలిపింది. సౌదీలోని రియాద్, జెడ్డాహ్‌లతోపాటు లండన్, దుబాయ్, సింగపూర్, వియన్నా‌లలో ఓ వేదికను బోర్డు పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. రియాద్, జెడ్డాహ్‌లలో అనుకూలమైన వేదికను గుర్తించడానికి బీసీసీఐ రెండు బృందాలుగా ప్రతినిధులను పంపింది. ప్రతినిధుల బృందాలు రియాద్ వేలం నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని బోర్డు సూచించినట్టు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed