- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐపీఎల్-2024 భారత్‌లోనే!.. క్లారిటీ ఇచ్చిన చైర్మన్ అరుణ్ ధుమాల్
దిశ, స్పోర్ట్స్ : రానున్న దేశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-2024 వేదిక, షెడ్యూల్ ఖరారు బీసీసీఐకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లను దేశం బయట నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ క్లారిటీ ఇచ్చారు. జాతీయా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టోర్నీని ఎక్కడికీ తరలించడం లేదని, భారత్‌లోనే జరిగేలా చూస్తామని చెప్పారు. ‘టోర్నీ భారత్‌లోనే జరిగేలా భారత ప్రభుత్వంతో మేము పనిచేస్తున్నాం. జనరల్ ఎలక్షన్ షెడ్యూల్ ఆధారంగా మేము ప్లాన్ చేస్తాం. ఎలక్షన్ షెడ్యూల్‌ను ఏ మ్యాచ్‌కు ఏ రాష్ట్రం ఆతిథ్యమివ్వాలో మేము ప్లాన్ చేస్తాం. మార్చి చివర్లో లీగ్ ప్రారంభం కావొచ్చు. ఏప్రిల్‌లో ఎన్నికలు ఉంటాయి. కాబట్టి, ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తాం.’ అని తెలిపారు. కాగా, మార్చి 22 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ రూపొందించనుంది. ఎన్నికల రోజు, అందుకు ఒక రోజు ముందు, వెనకాల రోజు మ్యాచ్‌లు లేకుండా బోర్డు షెడ్యూల్‌ను తయారు చేయనున్నట్టు తెలుస్తోంది.