సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ.. ఈసారి పూర్తి భిన్నంగా..

by Swamyn |
సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ.. ఈసారి పూర్తి భిన్నంగా..
X

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టు తమ కొత్త జెర్సీని గురువారం విడుదల చేసింది. గత జెర్సీకి పూర్తి భిన్నంగా ఉన్న ఈ కొత్త జెర్సీ.. సరికొత్త డిజైన్‌తో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఐపీఎల్‌లో ‘ఆరెంజ్ ఆర్మీ’గా పేరొందిన ఎస్ఆర్‌హెచ్.. తాజా జెర్సీలో ఆరెంజ్ కలర్‌ను అలానే ఉంచింది. కాకపోతే, ఆ ఆరెంజ్ కలర్‌ టీషర్ట్‌పై నల్లటి చారలు ఉన్నాయి. ఆరెంజ్ కలర్‌ను డామినేట్ చేసేలా ఉన్న నల్లటి చారలు.. చూడగానే అందరి దృష్టి పడేలా ఉంది. టీషర్ట్‌తోపాటు రెండు వైపులా ఆరెంజ్ కలర్ స్ట్రిప్స్‌తో ఉన్న బ్లాక్ కలర్‌ ప్యాంట్‌‌ ఉంటుంది. ఈ సందర్భంగా కొత్త జెర్సీని ధరించి ఉన్న భువనేశ్వర్ ఫొటోను ఎస్ఆర్‌హెచ్ ‘ఎక్స్’‌లో పంచుకుంది. ‘‘భగభగ మండే హైదరాబాద్ ఆవేశం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది’’ అంటూ రాసుకొచ్చింది. కాగా, ఈ జెర్సీ కొత్తగా తీసుకొచ్చింది కాదు. ‘సౌతాఫ్రికా టీ20 లీగ్’‌లోనూ ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యానికి ‘సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్’(ఎస్ఈసీ) అనే పేరుతో ఓ జట్టు ఉంది. ఎయిడెన్ మార్‌క్రమ్ కెప్టెన్‌గా ఉన్న ఆ జట్టు.. 2023, 24 సీజన్లలో వరుసగా విజేతగా నిలిచింది. దీంతో ఇదే సెంటిమెంట్ హైదరాబాద్ జట్టుకు సైతం వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కొత్త జెర్సీని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.


Advertisement

Next Story

Most Viewed