బ్యాటు ఝుళిపించిన అభిషేక్, త్రిపాఠి

by Harish |
బ్యాటు ఝుళిపించిన అభిషేక్, త్రిపాఠి
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమవుతున్నది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలో ఆ జట్టు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఐపీఎల్‌లో క్యాంప్‌లో ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. సోమవారం ఎస్‌ఆర్‌హెచ్ ఏ, ఎస్‌ఆర్‌హెచ్ బి గ్రూపులుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టుపై 6 వికెట్ల తేడాతో బి జట్టు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఏ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో అభిషేక్ శర్మ(73), రాహుల్ త్రిపాఠి (42 నాటౌట్) చెలరేగడంతో ఎస్‌ఆర్‌హెచ్ బి జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 199 పరుగులు చేసింది. కాగా, ఈ నెల 23న హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతాను ఢీకొట్టనుంది.

Advertisement

Next Story

Most Viewed