- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ ఆడబోతున్న గబ్బా టెస్టు హీరో.. ఆ జట్టులోకి విండీస్ నయా సంచలనం
దిశ, స్పోర్ట్స్ : గబ్బా టెస్టు హీరో, వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ సీజన్‌లో అతను లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడబోతున్నాడు. లక్నో ఫ్రాంచైజీ అతనితో ఒప్పందం చేసుకున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు శనివారం ధ్రువీకరించారు. లక్నో పేసర్, ఇంగ్లాండ్‌కు చెందిన మార్క్‌వుడ్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే, అతను వైదొలగడానికి నిర్దిష్ట కారణం వెల్లడించలేదు. జాతీయ జట్టు బాధ్యతల నేపథ్యంలో అతను వైదొలిగినట్టు తెలుస్తోంది. మార్క్‌వుడ్ స్థానంలో షామర్ జోసెఫ్ లక్నో జట్టులోకి వచ్చాడు. అతన్ని రూ. 3 కోట్లకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.
కాగా, ఇటీవల గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాపై విండీస్ చారిత్రాత్మక విజయంలో షామర్ జోసెఫ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆసిస్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగడంతో అతని పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగింది. గబ్బా టెస్టు విజయంతో ఆసిస్ గడ్డపై కరేబియన్ జట్టు 27 ఏళ్ల తర్వాత టెస్టు విజయం అందుకుంది. అలాగే, టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముందు షామర్ జోసెఫ్ అరంగేట్ర మ్యాచైనా తొలి టెస్టులో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండు టెస్టుల్లోనూ అదగొట్టిన షామర్ జోసెఫ్ 13 వికెట్లతో సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. రెండో టెస్టులో గాయపడిన అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అబుదాబిలో జరుగుతున్న ఐఎల్‌టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌తో ఒప్పందం చేసుకున్న అతను గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ నాటికి అతను పూర్తిగా కోలుకుని అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.