- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
మాజీ ఒలింపియన్లకు మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ : ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : మాజీ ఒలింపియన్లకు మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష తెలిపారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. మాజీ ఒలింపియన్ లింబా రామ్ దీనస్థితిని చూసిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పారు. ‘లింబా రామ్ ఆర్థికసాయం కోసం వీల్చైర్లో ఐవోఏ ఆఫీస్కు వచ్చారు. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఐవోఏ అథ్లెట్ల కోసం ఎంతో చేస్తుంది. వాటిలో మాజీ ఒలింపియన్లకు మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ తీసుకరావడం ఒకటి. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు ప్రతిపాదనలు పంపాం. మాజీ ఒలింపియన్లకు ఐవోఏ నుంచి చిన్న సహాయం. వారిని మనం గుర్తుపెట్టుకోవాలి.’ అని ఉష తెలిపారు.
Advertisement
Next Story