Women's Asia Cup: ఆసియా కప్ 2024 ఫైనల్: టాస్ గెలిచిన భారత్

by Mahesh |
Womens Asia Cup: ఆసియా కప్ 2024 ఫైనల్: టాస్ గెలిచిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ టీ20 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం భారత్ మహిళల జట్టు, శ్రీలంక మహిళా జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు బౌలింగ్ చేయనుంది. కాగా ఈ సీజన్ లో అన్ని మ్యాచుల్లో విజయం సాధించి ఫైనల్ చేరిన భారత జట్టు శ్రీలంకపై సునాయాసంగా కప్ గెలిచే అవకాశం ఉంది. అయితే మొత్తం ఎనిమిది సీజన్లలో భారత్ 7 సార్లు ఆసియా కప్ విజేతగా నిలవగా ఎనిమిదో టైటిల్ కోసం భారత్ ప్రయత్నిస్తుంది. అలాగే శ్రీలంక సెమీ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ జట్టుపై అనూహ్య విజయం సాధించి ఫైనల్ చేరింది. ఈ మ్యాచులో భారత్ ను ఓడించి ఆసియా కప్ విజేతగా నిలవాలని ఆ జట్టు చూస్తుంది మరీ ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి టైటిల్ గెలవాలని చూస్తోంది.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(w), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్

శ్రీలంక మహిళలు (ప్లేయింగ్ XI): విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(w), హాసిని పెరీరా, సుగండిక కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉద్దేశిక ప్రబోధని, సచికా ప్రబోధిని

Advertisement

Next Story

Most Viewed