చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు.. తొలి జట్టుగా..

by Vinod kumar |
చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు.. తొలి జట్టుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్‌ రికార్డుపుటల్లోకెక్కింది.

బర్మింగ్‌హామ్‌ వేదికగా టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ మీట్‌లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించి, తుదిపోరుకు అర్హత సాధించింది. నిన్న (ఆగస్ట్‌ 23) జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 163 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి, వరల్డ్ గేమ్స్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఫైనల్స్‌కు చేరింది. శనివారం జరుగబోయే టైటిల్‌ పోరుకు భారత్ రెడీ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed