IND vs SL: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టు ఎంపిక

by Mahesh |
IND vs SL: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టు ఎంపిక
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత భారత్ మొదటిసారి శ్రీలంకతో టీ20, వన్డే, సిరీస్‌లను ఆడబోతుంది. అలాగే భారత జట్టు హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి టూర్ కావడంతో భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ జట్టును పూర్తిగా ఈ సిరీస్‌కు తీసుకుంది. వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అలాగే టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా.. గిల్ వైస్ కెప్టెన్ గా 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ సారి వన్డే, టీ20 సిరీస్ లకు రెండు జట్లను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే వన్డే సిరీస్ కు సీనియర్లతో పాటు ఐపీఎల్ హీరోలు అయిన రియాన్ పరాగ్, హర్షిత్ రాణాలకు జట్టులో చోటు దక్కింది.

వన్డే జట్టు: రోహిత్ శర్మ(C) శుభ్ మాన్ గిల్(VC) విరాట్ కోహ్లీ, కేఎస్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా లకు చోటు దక్కగా.. మూడు వన్డే మ్యాచులు ఆగస్టు 2, 4, 7 తేదీలో శ్రీలంక వేదికగా జరగనున్నాయి.

టీ20 సిరీస్ జట్టు: సూర్యకుమార్ యాదవ్(C) గిల్ (vc)హార్దిక్ పాండ్యా, జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌లకు చోటు దక్కింది. జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి.

Advertisement

Next Story