ఐసీయులో చేరిన భారత స్టార్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. ఇప్పుడెలా ఉందంటే..?

by Mahesh |
ఐసీయులో చేరిన భారత స్టార్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. ఇప్పుడెలా ఉందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఈరోజు హుటాహుటిన ఐసీయూలో చేరారు. ప్రస్తుతం రంజీ ట్రోఫిలో కర్ణాటక జట్టు కెప్టెన్ గా మయాంక్ వ్యవహరిస్తున్నారు. కాగా న్యూఢిల్లీ వెళ్లే విమానంలో అగర్వాల్ గొంతు, నోటి నొప్పి, గొంతులో మంట తో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతన్ని అగర్తలలోని ఐఎల్‌ఎస్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని ప్రాణాపాయ ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు. అలాగే కొద్ది రోజుల పాటు అతనికి విశ్రాంతి అవసరమని తెలిపారు.

ఇదిలా ఉంటే.. రంజీలో కర్ణాటక కెప్టెన్ గా ఈ నెల 26-29 మధ్య త్రిపురతో మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కర్ణాటక జట్టు విజయం సాధించింది. అనంతరం జట్టుతో కలిసి ఢిల్లీ మీదుగా రాజ్‌కోట్‌కు వెళ్లాల్సి ఉండగా మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అగర్వాల్ పరిస్థితి నిలకడగా ఉండటంతో అతని జట్టు సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే త్వరలో జరిగే మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed