- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైనా చేతిలో భారత్ ఓటమి
దిశ, స్పోర్ట్స్ : మలేషియాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు ఓటమి ఎదురైంది. గురువారం గ్రూపు ‘ఏ’లో జరిగిన చివరి మ్యాచ్‌లో చైనా చేతిలో 3-2 తేడాతో పోరాడి ఓడింది. మొదట హెచ్ఎస్ ప్రణయ్ జట్టుకు శుభారంభం అందించాడు. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో అతను 6-21, 21-18, 21-19 తేడాతో వెంగ్ హాంగ్ యాంగ్‌పై పోరాడి గెలిచాడు. ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో అర్జున్, ధ్రువ్ కపిల ఓడిపోవడంతో స్కోర్లు 1-1తో సమయ్యాయి. ఇక, మరో సింగిల్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-11, 21-16 తేడాతో లీ లాంక్సీని మట్టికరిపించి భారత్‌ను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మరో గేమ్ గెలిస్తే భారత్ విజయం ఖాయమనుకున్న తరుణంలో డబుల్స్ మ్యాచ్‌లో సురాజ్-పృథ్వీ జోడీ నిరాశపరిచింది. దీంతో ఇరు జట్లు 2-2తో నిలిచాయి. ఇక, నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్‌లో చిరాగ్ సేన్ ఓడిపోవడంతో భారత్ విజయానికి దూరమైంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి చైనా విజేతగా నిలిచింది. ఈ ఓటమితో భారత్ నాకౌట్ బెర్త్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికే జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. తొలి గ్రూపు మ్యాచ్‌లో హాంకాంగ్‌ను చిత్తు చేసి టోర్నీలో ముందడుగు వేసింది. అయితే, గ్రూపు ఏలో చైనా రెండు విజయాలతో టాప్ పొజిషన్‌లో నిలువగా.. భారత్ ఒక్క విజయంతో రెండో స్థానంతో సరిపెట్టింది.