భారత హాకీ జట్టుకు రెండో ఓటమి

by Harish |
భారత హాకీ జట్టుకు రెండో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఐదు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 4-2 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. 9వ నిమిషంలో జుగ్‌రాజ్ సింగ్, 30 నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో ఫస్టాఫ్‌లో 2-1 తేడాతో భారత్‌ ఆధిక్యంలోని నిలిచింది. ఆ తర్వాత పట్టు కోల్పోయిన భారత్ సెకండాఫ్‌లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మరోవైపు, ఆస్ట్రేలియా పుంజుకుంది. మూడో క్వార్టర్‌లో మూడు గోల్స్ చేసి 4-2తో లీడ్‌లోకి వెళ్లిన ఆ జట్టు చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఆసిస్‌కు రెండో విజయం. శనివారం తొలి మ్యాచ్‌లో 5-1తో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ జట్టు 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఆ జట్టుదే. ఈ నెల 10న మూడో మ్యాచ్ జరగనుంది.

Advertisement

Next Story