ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

by Harish |
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు ఓటమితో ఆరంభించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పెర్త్ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 5-1 తేడాతో భారత్ ఘోర ఓటమిని పొందింది. గుర్జాంత్ సింగ్ 47వ నిమిషంలో భారత్ తరపున ఏకైక గోల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసిస్ మొదటి నుంచి చివరి వరకు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఫస్టాఫ్‌ను 2-0తో ఆధిక్యంలో నిలిచిన ఆ జట్టు సెకండాఫ్‌లో మరో మూడు గోల్స్ చేసింది. విక్హామ్ టామ్ రెండు గోల్స్‌తో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం ఇదే వేదికపై రెండో మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.

Advertisement

Next Story