Mohammed Habib: ఇండియన్​ ఫుట్‌బాల్​ లెజెండ్ మహ్మద్ హబీబ్ కన్నుమూత..

by Vinod kumar |   ( Updated:2023-08-15 17:11:00.0  )
Mohammed Habib: ఇండియన్​ ఫుట్‌బాల్​ లెజెండ్ మహ్మద్ హబీబ్ కన్నుమూత..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్​ ఫుట్‌బాల్​ లెజెండ్, హైదరాబాద్‌కు చెందిన ప్లేయర్​మహ్మద్ హబీబ్(74)​ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా డిమెన్షియా అండ్ పార్కిన్​సన్స్​ సిండ్రోమ్ ​వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నేడు (ఆగస్ట్ 15)న తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో 1949 జులై 17న జన్మించిన ఆయన.. హైదరాబాద్‌లోనే మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. 1970 బ్యాంకాక్​ వేదికగా జరిగిన ఆసియన్ గేమ్స్‌లో మరో హైదరాబాదీ ప్లేయర్ ​సయ్యద్​ నయీముద్దీన్​ కెప్టెన్సీలో ఆడిన హబీబ్.. బ్రాంజ్​ మెడల్‌ను అందుకున్నారు. ఫుట్​బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కోచ్‌గా వ్యవహరించారు. మహ్మద్​ హబీబ్ 1965 నుంచి 76 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు.

Advertisement

Next Story

Most Viewed