ఇలాంటి పిచ్‌లపై ఆడటం కష్టమే : శివమ్ దూబే

by Hajipasha |
ఇలాంటి పిచ్‌లపై ఆడటం కష్టమే : శివమ్ దూబే
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెటర్ శివమ్ దూబె గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.ఐపీఎల్‌లో చెన్నై తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసి టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్న దూబె.. ప్రపంచ కప్ టోర్నీ ఆరంభంలోని రెండు మ్యాచుల్లో (ఐర్లాండ్, పాకిస్తాన్) దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అయితే, అమెరికాతో జరిగిన మ్యాచులో తక్కువ స్కోర్ కే టాపార్డర్ కుప్పకూలగా సూర్యకుమార్ యాదవ్ (50)కు మద్దతుగా నిలిచిన దూబె (31) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కూడా దూబె విఫలమైతే తర్వాతి మ్యాచులకు స్థానం కోల్పోయే పరిస్థితి నెలకొన్న టైంలో అనుహ్యంగా పుంజుకున్నాడు.

అమెరికాతో జరిగిన మ్యాచులో టీమిండియా విజయం సాధించాక దూబె మాట్లాడుతూ ‘టోర్నీ ఆరంభంలో నా ఫామ్‌తో ఇబ్బంది పడ్డా. అందులో నుంచి ఎలా బయటపడాలనే దానిపై దృష్టి సారించా.దానికోసం తీవ్రంగా శ్రమించాను. ఆ టైంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. కోచ్‌లు, సహాయ్ సబ్బంది నాకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి పిచ్‌లపై ఆడటం చాలా కష్టం. అయినా, సిక్సులు కొట్టే సత్తా నీలో ఉంది. దానిని అనుసరించాలని’ కోచ్‌ పేర్కొన్నారు. అందుకే అమెరికాతో జరిగిన మ్యాచులో కాస్త విభిన్నంగా ఆడి పరుగులు సాధించాను. సరైన బంతిని సిక్సుగా మలచాలంటే ఆచితూచి ఆడాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని దూబె స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed