పుంజుకున్న భారత్.. మూడో రోజు ముగ్గురు ఆఫ్ సెంచరీ

by Mahesh |
పుంజుకున్న భారత్..  మూడో రోజు ముగ్గురు ఆఫ్ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచులో.. మొదటి రోజు వర్షార్పణం కాగా రెండో రోజు భారత్ కేవలం 46 పరుగులకు ఆలౌట్‌ అయ్యి చెత్త రికార్డును నెలకొల్పింది. అనంతరం మూడో రోజు మొదటి సెషన్‌లో ఇంగ్లాండ్ జట్టును 402 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ జైస్వాల్ 72 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత నెమ్మది నెమ్మదిగా భారీ స్కోరు దిశగా ముందుకు సాగింది. ఈ క్రమంలో జైస్వాల్ 72-1 వద్ద, రోహిత్ 95-2 వద్ద అవుట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ లు నిలకడగా బ్యాటింగ్ చేశారు.

మూడో రోజు చివరి సెషన్ వరకు ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేసి.. 100 పరుగుల బాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోయి 231 పరుగులు చేసింది. ఇందులో జైస్వాల్ 35, రోహిత్ శర్మ 52, పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 70 పరుగుల వద్ద మూడో రోజు చివరి బంతికి అవుట్ అయ్యాడు. కాగా ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 70* పరుగలుతో క్రీజులో ఉన్నారు. మొదటి రోజు పేలవమైన ఆట కనబరిచిన టాప్ ఆర్డర్ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు మాత్రం 3 అర్థ సెంచరీలను నమోదు చేశారు. కాగా ప్రస్తుతం భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed