రెండోది కూడా మనదే.. బంగ్లాపై టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ..

by Vinod kumar |
రెండోది కూడా మనదే.. బంగ్లాపై టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మహిళల టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్‌ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 96 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాను భారత్ 87 రన్స్‌కే అలౌట్ చేసింది. చివరి వరకు గెలిచేలా కనిపించగా.. ఆఖరి ఓవర్‌లో షఫాలీ వర్మ మేజిక్ చేశారు. ఏకంగా 3 వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటర్స్‌లో.. కెప్టెన్ నిగర్ సుల్తానా (38) పరుగులు చేయగా.. మిగిలిన బ్యాటర్స్ ఎవరు కూడా రాణించలేదు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3), షఫాలీ వర్మ (3), మిన్ను మణి (2) వికెట్లు తీయగా.. బారెడ్డి అనూష 1 వికెట్ తీశారు.

అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాను బంగ్లాదేశ్‌ బౌలర్లు కట్టడి చేశారు. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 95 పరుగలు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్‌ 3 వికెట్లతో తీయగా.. ఫాతిమా ఖాతూన్‌ 2, మరూఫా అక్తెర్‌, నమిద అక్తెర్‌, రబెయా ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఓపెనర్‌ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టాప్‌ భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌గా నిలిచింది. షఫాలీ సహా స్మృతి మంధన (13), యస్తిక భాటియా (11), దీప్తి శర్మ (10), అమన్‌జోత్‌ కౌర్‌ (14) రెండంకెల స్కోర్లతో మాత్రమే చేశారు. ఈ సిరీస్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story