సాక్ష్యులు నాకు 18 ఏళ్లుగా తెలుసు.. కేటీఆర్ సంచలన స్టేట్మెంట్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-23 11:34:15.0  )
సాక్ష్యులు నాకు 18 ఏళ్లుగా తెలుసు.. కేటీఆర్ సంచలన స్టేట్మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై పరువు నష్టం కేసులో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) నాంపల్లి కోర్టు(Nampally Court)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు కేటీఆర్‌ను స్టేట్మెంట్‌ను రికార్డు చేసింది. ‘బాధ్యతగల పదవిలో ఉన్న మహిళా మంత్రి నా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. సాక్షులు నాకు 18 ఏళ్లుగా తెలుసు. కొండా సురేఖ వ్యాఖ్యలను టీవీలో చూశాను. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె నాపై మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నేను ఫోన్ ట్యాపింగ్ చేశాననీ మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవం’ అని మొత్తం 30 నిమిషాల పాటు కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన ఆమెపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈనెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈనెల 14న విచారణ జరిపిన కోర్టు.. ఈనెల 23కు వాయిదా వేసింది. దీంతో బుధవారం కేటీఆర్ కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు బాల్క సుమన్, సత్యవతి రాధోడ్, తుల ఉమ, దాసోజుశ్రవణ్‌లు కోర్టుకు వచ్చారు.

Advertisement

Next Story