INDvsPAK: దెబ్బ కొట్టాల్సిందే.. ప్రతీకారం తీసుకోవాలంటున్న ఫ్యాన్స్!

by GSrikanth |   ( Updated:2022-10-23 02:06:35.0  )
INDvsPAK: దెబ్బ కొట్టాల్సిందే.. ప్రతీకారం తీసుకోవాలంటున్న ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళ జరుగనుంది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థుల పోరు ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ మైదానం ఇప్పటికే సిద్ధమైంది. అయితే, ఒకప్పుడు పాకిస్తాన్‌పై టీమిండియా సులభంగా గెలవడం మనం చూశాం. కానీ, ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అన్ని విభాగాల్లోనూ పాకిస్తాన్ ఇండియాకు గట్టి పోటీ ఇస్తోంది. అంతేగాక, గత టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఘోరంగా ఓడించడమే కాకుండా, ఆసియా కప్‌లోనూ భారీ దెబ్బ కొట్టింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌ ఎలాగైనా గెలిచి తీరాలని టీమిండియా ప్రతీకారేచ్ఛతో ఉంది. దీని కోసం రోహిత్ కోసం ప్రత్యేకంగా కష్టపడినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌‌పై పైచేయి సాధించాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌ ఎంత ఉత్కంఠ రేపుతుందో చూడాలి.

జట్లు అంచనా:

భారత్: రోహిత్ శర్మ (c), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (wk), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్/యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్/మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్తాన్: బాబర్ అజామ్ (c), మహ్మద్ రిజ్వాన్ (WK), షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హైదర్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ షా ఆఫ్రీది

Advertisement

Next Story