కోహ్లీ‌పై ఇంగ్లాండ్ లెజెండరీ బౌలర్ కీలక వ్యాఖ్యలు

by Harish |
కోహ్లీ‌పై ఇంగ్లాండ్ లెజెండరీ బౌలర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమవడంపై ఇంగ్లాండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ లేకపోవడం ఆ సిరీస్‌కే అవమానం అని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రాడ్‌ను కోహ్లీ గురించి అడగగా.. ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ దూరమవడం సిరీస్‌కే అవమానం. కోహ్లీ నాణ్యమైన ఆటగాడు. ఆట ప‌ట్ల విరాట్ అంకితభావంతో ఉంటాడు. మైదానంలో దూకుడుగా కనిపిస్తాడు. కానీ, వ్యక్తిగత విషయాలు కచ్చితంగా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. కోహ్లీ దూరమవడం వల్ల యువకులకు అవకాశం లభిస్తుంది. భారత బ్యాటింగ్ లైనప్‌లో ఏదో ఒక దశలో ఎవరైనా నిలబడొచ్చు.’ అని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లాండ్ బజ్‌బాల్ ఆటపై బ్రాడ్ మాట్లాడుతూ.. తాను దాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. ‘ప్రతి దేశంలో బజ్‌బాల్ పనిచేస్తుందని నిరూపించాం. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. బజ్‌బాల్ ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచుతుంది.’ అని చెప్పాడు. అలాగే, తాను మైదానంలో తిరిగి అడుగుపెట్టే ఆలోచన లేదని బ్రాడ్ స్పష్టం చేశాడు. లీగ్ క్రికెట్ ఆడటంపై బ్రాడ్ స్పందిస్తూ..‘యాషెస్‌తో నేను రిటైర్మెంట్ ప్రకటించాను. ఆఖరి బంతికి వికెట్ తీయడంతోపాటు చివరి బంతికి సిక్స్ కొట్టడం నా అదృష్టం. నేను మళ్లీ బౌలింగ్ చేయడం మీరు చూడకపోవచ్చు.’ అని బ్రాడ్ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed