శతక్కొట్టిన తౌహిద్ హృదయ్.. భారత్ ముందు బంగ్లా పెట్టిన టార్గెట్ ఎంతంటే?

by Harish |
శతక్కొట్టిన తౌహిద్ హృదయ్.. భారత్ ముందు బంగ్లా పెట్టిన టార్గెట్ ఎంతంటే?
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. బంగ్లా జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసి ఆలౌటైంది. తౌహిద్ హృదయ్(100) సెంచరీతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు జాకర్ అలీ(68) కూడా సత్తాచాటాడు. ఆరంభంలో బంగ్లా దారుణంగా తడబడింది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 100 రన్స్ లోపే కుప్పకూలేలా కనిపించింది. అయితే, తౌహిద్, జాకర్ జట్టును ఆదుకున్నారు. 6 వికెట్‌కు 154 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో బంగ్లా పోరాడే స్కోరు సాధించింది. ఆఖర్లో భారత బౌలర్లు మరోసారి రెచ్చిపోవడంతో బంగ్లాదేశ్ 39 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ముగించింది. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ 2 వికెట్లతో సత్తాచాటారు.

Next Story