- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Women’s Asia Cup : భారత్‌కు అదిరిపోయే బోణీ.. పాక్ చిత్తు చిత్తుగా
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు అదరహో.. పాకిస్తాన్‌తో పోరు రసవత్తరంగా సాగుతుందనుకుంటే హర్మన్‌ప్రీత్ సేన ఏకపక్షం చేసింది. చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా చిత్తుగా ఓడించింది. దాయాదీ జట్టు ఏ విభాగంలో కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. భారత్ విసిరిన పంజాకు విలవిలలాడిపోయింది. ఫలితంగా ఆసియా కప్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం.
ఆసియా కప్‌లో భారత్‌కు అదిరిపోయే శుభారంభం దక్కింది. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. డంబుల్లా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలింగ్‌లో తేలిపోయి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. 109 లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 14.1 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది. ఛేదనను ఓపెనర్లు షెఫాలీ వర్మ(40), స్మృతి మంధాన(45) ధాటిగా ప్రారంభించారు. ఏ పిచ్‌పై అయితే పాక్ బ్యాటర్లు తడబడ్డారో అక్కడే వీరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పాక్ బౌలర్లపై విరుచుకపడి బౌండరీలు బాదారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 85 పరుగులు జోడించడంతో విజయం సునాయాసమైంది. అయితే, స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ వికెట్లు పారేసుకున్నారు. షెఫాలీ అవుటయ్యే సమయానికి భారత్ విజయానికి ఇంకా 9 పరుగులు అవసరమవ్వగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(5 నాటౌట్), రోడ్రిగ్స్(3 నాటౌట్) విజయాన్ని లాంఛనం చేశారు.
పేసర్లు, స్పిన్నర్లు కలిసి కూల్చేశారు
అంతకుముందు భారత బౌలర్లు పాక్‌ను కట్టడి చేశారు. రేణుక, పూజ పేస్‌తో బెంబేలెత్తిస్తే.. దీప్తి, శ్రేయాంక స్పిన్ మంత్రంతో దెబ్బకొట్టారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాక్ జట్టు కష్టంగా 100 పరుగుల మార్క్‌ను దాటింది. మొదటి నుంచి పాక్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఓపెనర్లు గుల్ ఫిరోజా(5), మునీబా అలీ(11)లను పూజ పవర్ ప్లేలోనే అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని మొదలుపెట్టింది. అమీన్(25) కాసేపు పోరాడగా.. మరో ఎండ్‌లో అలియా రియాజ్(6), కెప్టెన్ నిదా దార్(8), జావెద్(0) విఫలమవడంతో పాక్ 61/6తో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో తుబా హసన్(22), ఫాతిమా సనా(22 నాటౌట్) పోరాటంతో ఆ జట్టు స్కోరు 100 దాటింది. దీప్తి వేసిన 18వ ఓవర్‌లో తుబా హసన్, నష్రా సంధు(0) వికెట్లు కోల్పోగా.. సయేదా అరూబ్ షా(2) రనౌటవడంతో ఆ ఓవర్‌లో మూడు వికెట్లు పడ్డాయి. ఇక, ఆఖరి ఓవర్‌లో సాదియా ఇక్బాల్(0)ను శ్రేయాంక అవుట్ చేయడంతో పాక్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రేణుక, పూజ, శ్రేయాంక రెండేసి వికెట్లు పడగొట్టాడు.
స్కోరుబోర్డు
పాకిస్తాన్ ఇన్నింగ్స్ : 108 ఆలౌట్(19.2 ఓవర్లు)
గుల్ ఫిరోజా(సి)హర్మన్‌ప్రీత్(బి)పూజ 5, మునీబా అలీ(సి)రోడ్రిగ్స్(బి)పూజ 11, అమీన్(సి)రాధా(బి)రేణుక 25, అలియా రియాజ్ (సి)రోడ్రిగ్స్(బి)శ్రేయాంక 6, నిదా దార్(సి)హేమలత(బి)దీప్తి 8, తుబా హస్సన్(సి)రాధా(బి)దీప్తి 22, ఇరామ్ జావెద్ ఎల్బీడబ్ల్యూ(బి)రేణుక 0, ఫాతిమా సనా 22 నాటౌట్, సయేదా అరూబ్ షా రనౌట్(రాధా) 2, నష్రా సంధు(సి)రిచా ఘోష్(బి)దీప్తి 0, సాదియా ఇక్బాల్(బి)శ్రేయాంక 0; ఎక్స్‌ట్రాలు 7.
వికెట్ల పతనం : 9-1, 26-2, 41-3, 59-4, 61-5, 61-6, 92-7 , 94-8, 94-9, 108-10
బౌలింగ్ : రేణుక(4-0-14-2), పూజ(4-0-31-2), దీప్తి(4-0-20-3), రాధా(4-0-26-0), శ్రేయాంక(3.2-0-14-2)
భారత్ ఇన్నింగ్స్ : 109/3(14.1 ఓవర్లు)
షెఫాలీ వర్మ(సి)సయేదా అరూబ్ షా 40, స్మృతి మంధాన(సి)అలియా రియాజ్(బి)సయేదా అరూబ్ షా 45, హేమలత(సి)తుబా హస్సన్(బి)నష్రా సంధు 14, హర్మన్‌ప్రీత్ 5 నాటౌట్, రోడ్రిగ్స్ 3 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 2.
వికెట్ల పతనం : 85-1, 100-2, 102-3
బౌలింగ్ : సాదియా ఇక్బాల్(2.1-0-18-0), ఫాతిమా సనా(2-0-15-0), నిదా దార్(1-0-10-0), తుబా హస్సన్(2-0-36-0), నష్రా సంధు(4-0-20-1), సయేదా అరూబ్ షా(3-0-9-2)