వెస్ట్ ఇండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి

by Javid Pasha |   ( Updated:2023-09-01 15:51:59.0  )
వెస్ట్ ఇండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి
X

దిశ, వెబ్ డెస్క్: వెస్ట్ ఇండీసే కదా.. ఇటీవల జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి పసికూనల చేతిలో ఓడి ప్రపంచ కప్ కు అర్హత సాధించలేకపోయింది కదా.. అలాంటి జట్టు తమను ఏం చేస్తుందిలే అని అతి విశ్వాసానికి పోయి ప్రయోగాలు చేసిన భారత్ కు షాక్ తగిలింది. కరేబియను జట్టుతో జరిగిన రెండో వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. వన్డే కప్ కు మరెన్నో రోజులు కూడా సమయం లేదు. ఈ టైంలో భారత జట్టు ఆటతీరు అభిమానులను కలవరపెడుతోంది. మెగా టోర్నీ దిశగా భారత జట్టు ప్రిపరేషన్ కరెక్ట్ దిశలోనే వెళ్తోందా అనే సందేహాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. పొరపాట్ల నుంచి భారత్ జట్టు పాఠాలు నేర్చుకుంటుందా? ప్రపంచ కప్ కు ముందు జట్టును పటిష్టపరుస్తుందా? ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

ఇక కప్పు గెలవాలంటే ప్రతి మ్యాచ్‌ కూడా కీలకమే. అత్యుత్తమ జట్టును బరిలో దింపాల్సి ఉంటుంది. ఏ స్థానంలో ఏ ఆటగాడు ఆడాలి. ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి. ఓపెనింగ్‌ చేసేది ఎవరు? మిడిలార్డర్‌లో నిలబడేది ఎవరు? పేస్‌ బౌలింగ్‌ భారాన్ని పంచుకునేది ఎవరు? స్పిన్‌తో చుట్టేసేది ఎవరు?.. ఇలా ఇప్పటికే తుది జట్టుపై స్పష్టత రావాల్సింది పోయి ప్రయోగాల పుణ్యమా అని మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచకప్‌కు ముందు భారత్ 6 ఆసియా కప్ లో ఆస్ట్రేలియాతో 3 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్లో మార్పులు చేస్తూ పోతే.. ప్రపంచకప్‌లో ఆడించే జట్టులో ఆటగాళ్ల స్థానాలపై స్పష్టత ఎలా వస్తుందన్నది మేనేజ్‌మెంట్‌కే తెలియాలి. నిర్దిష్టమైన స్థానాల్లో ఆటగాళ్లను నిలకడగా ఆడిస్తే,అప్పుడు ఫైనల్ గా ఓ అంచనా ఏర్పడే ఆస్కారముంది.

Advertisement

Next Story

Most Viewed