బ్రిస్బేన్ టెస్టు కోసం టీమిండియా సన్నద్ధత ప్రారంభం.. నెట్స్‌లో చెమటోడ్చిన భారత క్రికెటర్లు

by Harish |
బ్రిస్బేన్ టెస్టు కోసం టీమిండియా సన్నద్ధత ప్రారంభం.. నెట్స్‌లో చెమటోడ్చిన భారత క్రికెటర్లు
X

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియాకు రెండో టెస్టులో ఆస్ట్రేలియా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో గెలుపుతో ఆసిస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-1తో సమం చేసింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరుకోవాలంటే మిగతా టెస్టుల్లో గెలవడం రోహిత్ సేనకు కీలకం. కాబట్టి, రెండో టెస్టు ఓటమి నుంచి పుంజుకోవాలని భావిస్తున్నది. కీలకమైన బ్రిస్బేన్ టెస్టు కోసం సన్నద్ధత మొదలుపెట్టింది.

అడిలైడ్‌లో భారత ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీస్ చేశారు. ఆ వీడియోను బీసీసీఐ షోషల్ మీడియా వేదికగా పంచుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ పర్యవేక్షణలో చెమటోడ్చారు. కెప్టెన్ రోహిత్, కోహ్లీ డిఫెన్స్ నైపుణ్యాలపై దృష్టి పెట్టారు. విరాట్ చెక్ డ్రైవ్స్ ప్రాక్టీస్ చేయగా.. రోహిత్ డిఫెన్సివ్ స్ట్రోక్స్, బ్యాక్‌‌ఫుట్ డ్రైవ్స్ సాధన చేశాడు. కేఎల్ రాహుల్, జైశ్వాల్, పంత్ కూడా నెట్స్‌లో కష్టపడ్డారు. బౌలర్లలో జడేజా, ముకేశ్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్, అశ్విన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.


Next Story