పారాలింపిక్స్‌లో భారత పతకధారులుగా సుమిత్, భాగ్యశ్రీ

by Harish |
పారాలింపిక్స్‌లో భారత పతకధారులుగా సుమిత్, భాగ్యశ్రీ
X

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 28 నుంచి పారిస్ వేదికగా పారాలింపిక్స్ మొదలుకానున్నాయి. సెప్టెంబర్ 8 వరకు ఈ విశ్వక్రీడలు జరుగుతాయి. పారిస్ పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి సుమిత్ అంతిల్, భాగ్యశ్రీ జాదవ్ నాయకత్వం వహించనున్నారు. భారత పతకధారులుగా సుమిత్, భాగ్యశ్రీలను ఎంపిక చేసినట్టు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది.

స్టార్ జావెలిన్ త్రోయర్ సుమిత్ ఎఫ్‌ 64 కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాడు. అలాగే, షాట్‌పుట్ క్రీడాకారిణి భాగ్యశ్రీ గతేడాది ఆసియా క్రీడల్లో ఎఫ్‌ 34 కేటగిరీలో రజత పతకం సాధించింది. కాగా, పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. పారాలింపిక్స్ చరిత్రలోనే భారత్ అతిపెద్ద బృందాన్ని పంపించబోతున్నది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు గెలిచింది. ఈ సారి 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed