- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 3 ఫార్మాట్‌లో అగ్రస్థానం
దుబాయ్ : పురుషుల క్రికెట్‌లో టీమ్ ఇండియా అరుదైన రికార్డు సృష్టించింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకకాలంలో మూడు ఫార్మాట్లలోనూ నం.1 ర్యాంక్‌ను సాధించింది. ఇప్పటికే టీ20, వన్డే ఫార్మాట్లలో భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా.. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. దాంతో మూడు ఫార్మాట్లలో నం.1గా నిలిచిన రెండో జట్టుగా టీమ్ ఇండియా రికార్డు నెలకొల్పింది. 2014లో సౌతాఫ్రికా ఈ రికార్డును సాధించింది. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకుంది.
బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడంతోపాటు ఆస్ట్రేలియాపై తొలి టెస్టు నెగ్గడం ద్వారా రోహిత్ సేన 115 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ పొజిషన్‌ను చేజిక్కించుకుంది. దాంతో ఒకే సమయంలో మూడు ఫార్మాట్లలో జట్టును అగ్రస్థానంలో నిలిపిన తొలి కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. గతంలో ఎం.ఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలో నం.1 స్థానం సంపాదించిన ఏకకాలంతో మాత్రం జట్టు అగ్రస్థానంలో నిలవడం మాత్రం ఇదే తొలిసారి. రెండో స్థానంలో ఆస్ట్రేలియా(111), ఇంగ్లాండ్(106) మూడో స్థానంలో ఉన్నాయి.
టీ20ల్లో 267 రేటింగ్ పాయింట్లతో, వన్డేల్లో 114 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇటీవల న్యూజిలాండ్‌పై 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో టీమ్ ఇండియా వన్డే ఫార్మాట్‌లో టాప్ ర్యాంక్‌ను పొందిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లోనూ టీమ్ ఇండియా క్రికెటర్లు ఆటను శాసిస్తున్నారు.
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్, వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్, టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా నం.1 పొజిషన్‌లో కొనసాగుతున్నారు. ఆసీస్‌తో తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్(867) అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్ కేవలం 21 రేటింగ్ పాయింట్స్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. రెండో టెస్టులో అశ్విన్ మరోసారి విజృంభిస్తే టాప్ ర్యాంక్ కొల్లగొట్టడం అతనికి అంత కష్టమేమీ కాదు.