Rohit Sharma: అరుదైన జాబితాలో రోహిత్‌ శర్మ..

by Vinod kumar |   ( Updated:2023-07-13 10:00:24.0  )
Rohit Sharma: అరుదైన జాబితాలో రోహిత్‌ శర్మ..
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజే టీమిండియా పైచేయి సాధించింది. ఆతిథ్య జట్టును 150 పరుగులకే ఆలౌట్‌ చేసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు(5) వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా 3 వికెట్లు దక్కించుకున్నాడు.పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరుల(యాక్టివ్‌ క్రికెటర్లు) జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌ వెటరన్‌ బ్యాటర్‌, టెస్టుల్లో ప్రస్తుత నెంబర్‌ 1 కేన్‌ విలియమ్సన్‌ను అధిగమించి టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 30 పరుగులు సాధించిన హిట్‌మ్యాన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 17,145 రన్స్‌ పూర్తి చేసుకున్నాడు.

భారత ఓపెనర్లు శుభారంబాన్ని అందించారు. ఈ క్రమంలో ఆట ఆరంభించిన భారత్‌కు తొలిరోజు గంటకు పైగా ఆడే అవకాశం వచ్చింది. అరంగేట్ర ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ 73 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 65 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు స్కోరు చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల ప్లేయర్స్..

1. విరాట్‌ కోహ్లి(ఇండియా)- 25385.

2. క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌)- 19593.

3. జో రూట్‌ (ఇంగ్లండ్‌)- 18336.

4. డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- 17267.

5. రోహిత్‌ శర్మ(ఇండియా)- 17145

Advertisement

Next Story