Asia Cup 2023: ఆసియా కప్‌లో అరుదైన ఫీట్.. ఇర్ఫాన్‌ను వెనక్కినెట్టిన టీమిండియా స్టార్ బౌలర్..

by Vinod kumar |
Asia Cup 2023: ఆసియా కప్‌లో అరుదైన ఫీట్.. ఇర్ఫాన్‌ను వెనక్కినెట్టిన టీమిండియా స్టార్ బౌలర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్-2023 లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్)లో భారత్​తరఫున అత్యధిక వికెట్లు (24) తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టి.. ఇర్ఫాన్ పఠాన్​(22 వికెట్లు)ను అధిగమించాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా స్పిన్నర్ కుల్​దీప్​యాదవ్ (19) వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గా ఆసియా కప్​చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లిస్ట్‌లో.. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్ (30 వికెట్లు) టాప్‌లో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed