IND vs ENG :రెండో టీ20కి ఇంగ్లాండ్ జట్టు ఎంపిక.. స్టార్ బౌలర్‌పై వేటు

by Harish |
IND vs ENG :రెండో టీ20కి ఇంగ్లాండ్ జట్టు ఎంపిక.. స్టార్ బౌలర్‌పై వేటు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా చేతిలో తొలి టీ20లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ సిరీస్‌లో పుంజుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే నేడు జరిగే రెండో టీ20కి తమ జట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్ ఆడిన జట్టులో ఒక మార్పు చేసింది. కోల్‌కతాలో నిరాశపర్చిన అట్కిన్సన్‌పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వేటు వేసింది. తుది జట్టు నుంచి అతన్ని తప్పించింది. తొలి టీ20లో అతను 2 రన్సే చేయగా.. 2 ఓవర్లే వేసి 38 పరుగులు ఇచ్చాడు. రెండో టీ20కి అతని స్థానంలో బ్రైడన్ కార్సేను తీసుకున్నారు. అలాగే, ఇంగ్లాండ్ 12వ ప్లేయర్‌గా జేమీ స్మిత్‌ను జట్టులో చేర్చింది. జాకబ్ బెథెల్ ఆడటంపై అనుమానాలు నెలకొనడంతో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం కారణంగా బెథెల్ శుక్రవారం ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనలేదు. మ్యాచ్ సమయానికి బెథెల్ కోలుకోకపోతే స్మిత్‌ తుది జట్టులోకి రానున్నాడు.

ఇంగ్లాండ్ జట్టు

బెన్ డక్కెట్, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్.


Next Story

Most Viewed