- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND vs BAN 1st T20I: టాస్ గెలిచిన భారత జట్టు
దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ భారత పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ అనంతరం, మూడు టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. మొదటి టీ20 గ్వాలియర్ లోని న్యూ మాధవ్ రావ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇదిలా ఉంటే భారత జట్టులో పూర్తిగా యువ ప్లేయర్లకు చోటు దక్కింది. 2024 ఐపీఎల్ సీజన్‌లో మెరుపులు సృష్టించిన యువప్లేయర్లకు ఈ టీ20 జట్టులో చోటు దక్కింది. ముఖ్యంగా యువ ప్లేయర్ మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకుని మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇదిలా ఉంటే టెస్ట్ సిరీస్ కోల్పోయిన బంగ్లా జట్టు ఈ టీ20 సరీస్ ను కైవసం చేసుకుంటామని.. భారత జట్టును ఓడిస్తామని మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. మరీ ఈ మొదటి మ్యాచులో బంగ్లా ప్లేయర్లు ఏ విధంగా రాణిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్(w), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(c), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం