ఆసీస్‌ను ‘కంగారు’ పెట్టించిన టీమిండియా బౌలర్లు..

by Vinod kumar |
ఆసీస్‌ను ‘కంగారు’ పెట్టించిన టీమిండియా బౌలర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌కు ‘కంగారు’ పెట్టించారు టీమ్ ఇండియా బౌలర్లు. ఆసీస్‌ను 188 పరుగులకే కట్టటి చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మార్ష్ (81), జోష్(26), స్మిత్(22) తప్ప మిగతా వారు ఎవరూ రాణించలేదు. టీమ్ ఇండియా బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లు తీయగా.. జడేజా 2, పాండ్య, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.


Advertisement

Next Story