- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND vs AUS: విశాఖలో టాస్ ఓడిన భారత్
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో ఉదయం నుండి కొనసాగుతోన్న తీవ్ర ఉత్కంఠకు తెర పడింది. ఉదయం నుండి కురుస్తోన్న వర్షం తగ్గడంతో విశాఖపట్నంలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న రెండవ వన్డేకు లైన్ క్లియర్ అయ్యింది. వరుణుడు కరుణించడంతో అంపైర్స్ టాస్ వేశారు. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఉదయం నుండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు భారీగా విశాఖ స్టేడియానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అభిమానులతో విశాఖ స్టేడియం కిక్కిరిపోయింది. ఇక, భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో అధిక్యంలో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది.
జట్ల వివరాలు:
ఇండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KL రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(w), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా