- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెమీస్ బెర్త్‌పై యువ భారత్ కన్ను.. రేపు నేపాల్‌తో ఢీ
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌లో భారత అండర్-19 జట్టు అదిరే ప్రదర్శన చేస్తున్నది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద ఉన్నది. గ్రూపు దశలో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన భారత జట్టు.. సూపర్-6 రౌండ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించింది. తొలి సూపర్-6 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 214 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడు యువ భారత్ సెమీస్ బెర్త్‌పై కన్నేసింది. గ్రూపు-1లో టాప్ పొజిషన్‌లో భారత జట్టు దాదాపుగా సెమీస్ చేరుకోవడం ఖాయమే. అయితే, నేడు నేపాల్‌తో జరగబోయే చివరి సూపర్-6 మ్యాచ్‌లోనూ నెగ్గి అధికారికంగా సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవాలనుకుంటున్నది. ప్రస్తుతం టీమ్ ఇండియా జోరు చూస్తుంటే పసికూన నేపాల్‌పై విజయం నల్లేరు మీద నడకే. టోర్నీలో ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గిన నేపాల్.. ఇప్పటికే ఎలిమినేట్ అయ్యింది. మరోవైపు, భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నది. ముషీర్ ఖాన్, అర్షిన్ భీకర ఫామ్‌లో ఉండటం జట్టుకు బలం. కివీస్‌పై హాఫ్ సెంచరీతో ఆదర్శ్ సింగ్ కూడా ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్ ఉదయ్, తెలుగు కుర్రాడు అవనీశ్ పర్వాలేదనిపిస్తున్నారు. ఇక, సౌమీ పాండే, నమన్ తివారి, రాజ్ లింబానిలతో కూడిన బౌలింగ్ దళం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నది.
Read More..