మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌కు బిగ్ షాక్ ఇచ్చిన జట్లు

by Mahesh |   ( Updated:2024-11-24 13:22:05.0  )
మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌కు బిగ్ షాక్ ఇచ్చిన జట్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 కు సంబంధించిన మెగా వేలం( mega auction) దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఈ మెగా వేలంలో ఇప్పటికే భారత యువ ప్లేయర్లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. ముఖ్యంగా పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలకగా.. శ్రేయస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో లంచ్ తర్వాత మూడో సెట్ వేలం ప్రారంభం కాగా.. ఆస్ట్రేలియా ఓపెనర్, సీనియర్ ప్లేయర్, డేంజరస్ బ్యాటర్ అయిన డేవిడ్ వార్నర్(David Warner)కు వేలంలో షాక్ తగిలింది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ లో వేలంలో నిలిచిన వార్నర్ ను కొనేందుకు ఏ జట్లు ఆసక్తి చూపకపోవడంతో డేవిడ్ వార్నర్ ను అమ్ముడుపోని ప్లేయర్ గా ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న డేవిడ్ వార్నర్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ గా నిలిచిపోవడంతో అతని అభిమానులతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా వేలం చివర్లో అమ్ముడుపోని ప్లేయర్లకు మరోసారి అవకాశం కల్పించనున్నారు.

Advertisement

Next Story