- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ ఛాన్స్ వస్తే.. ధోనీ లా మారతా! న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా క్రికెట్ చరిత్రలో ధోనీ పేరొక సువర్ణాధ్యాయం. మహేంద్ర సింగ్ ధోనీ జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు. తర్వాత క్రికెట్ మీద ధోనీకున్న ప్రేమ, ఆసక్తి అతన్ని ఈ స్థాయికి చేర్చాయి. ధోనీ వికెట్ కీపర్ గా, స్టార్ బ్యాట్స్ మెన్ గా నిల్కదొక్కుకొని టీమిండియాలో అంచలంచెలుగా ఎదిగిన సంగతి మనకు తెలిసిందే. కెప్టెన్ గా ధోనీ సాధించిన రికార్డులను భవిష్యత్తులో మరొకరు చెరిపేయొచ్చు కానీ.. గ్రౌండ్ లో అతనిలా పద్మవ్యూహాలు రచించే సత్తా మాత్రం ధోనీకే ఉందనడంలో అతిశయోక్తి కాదేమో! అలాంటి దమ్మున్న ఆటగాడికి అభిమానులు మైదానం బయటే కాదు, మైదానం లోపల ఆడే క్రికెట్ దిగ్గజాలు కూడా ధోనీని ప్రేరణగా తీసుకుంటారు. వారిలో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ ఒకరు. అయితే.. తాజాగా సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల ఈవెంట్ కు హాజరైన టిమ్ సౌథీని.. అక్కడ విలేకరులు మీకు అవకాశం వస్తే ఏ క్రికెటర్ లా మారాలని ఉందని అడిగిన ప్రశ్నకు, తర్వాత సౌథీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. నాకు మహేంద్ర సింగ్ ధోనీలా మారిపోవాలని ఉందని సమాధానం ఇచ్చాడు. తనకు ధోనీలా కనీసం ఒక్కరోజైనా గడపాలని ఉందని, అతని జీవితం ఎలా ఉంటుందో ఒక్క రోజైనా రుచి చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ.