ఇండోర్ టెస్ట్ లో రాహుల్ ఆడుంటే.. కెరీర్ ఖతమే! : మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
ఇండోర్ టెస్ట్ లో రాహుల్ ఆడుంటే.. కెరీర్ ఖతమే! : మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండోర్ జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఫామ్‌ లేక తంటాలు పడుతున్న అతన్ని టీం మేనేజ్‌ మెంట్ పక్కన పెట్టింది. ఈ సిరీసులో తొలి రెండు మ్యాచుల్లో అతని బ్యాటింగ్ పరమ చెత్తగా ఉంది. దీంతో చాలామంది అభిమానులు, మాజీ క్రికెట్లర్లు రాహుల్‌ను తుది జట్టులో ఆడించడం పట్ల మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అతడిని మూడో టెస్టులో మేనేజ్‌ మెంట్ ఆడించలేదు. ఈ విషయంపై మాజీ సెలెక్టర్, టీమిండియా లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంతో కీలక వ్యాఖ్యలు చేశాడు.

అన్నింటి కన్నా ముందు ఇండోర్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ ఆడనందుకు తాను సంతోషిస్తున్నట్లు తెలిపాడు. అతను అలాంటి పిచ్‌పై ఆడకపోవడమే చాలా మంచిది. తొలి రెండు టెస్టుల్లో ఫెయిలైన అతను మిగతా రెండు మ్యాచుల్లో కూడా దారుణంగా విఫలమై ఉంటే అతని టెస్టు కెరీర్ దాదాపుగా ముగిసిపోయేదని తెలిపాడు. అందుకే అతను ఇండోర్ టెస్ట్ లో ఆడనందుకు చాలా సంతోషిస్తున్నట్లు తెలిపాడు. ఇండోర్‌లో తయారు చేసిన పిచ్‌పై ఎవరైనా సరే పరుగులు చేయడం కష్టమేనని పేర్కొన్నాడు.

Advertisement

Next Story